- ఈ హదీసులో ముఅజ్జిన్ పలికిన విధంగా అవే పదాలను తిరిగి పలకాలి అనే హితబోధ ఉన్నది.
- అలాగే ఈ హదీసులో ముఅజ్జిన్ యొక్క అజాన్ పూర్తి అయిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ‘సలవాత్’ (దరూద్) పఠించుట యొక్క ఘనత తెలుస్తున్నది.
- అదే విధంగా ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించిన తరువాత, వారికి ‘వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్’ను వేడుకోవాలనే హితబోధ ఉన్నది.
- ‘వసీలహ్’ అంటే దాని అర్థము (స్వర్గములో) అదొక సమున్నతమైన, అత్యున్నతమైన స్థానము అని వివరణ, మరియు అది కేవలం ఒక్కరికి మాత్రమే ప్రసాదించబడుతుంది అనే వ్యాఖ్యానాలు ఉన్నాయి.
- (స్వర్గములో) అత్యున్నతమైన స్థానము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు నిర్ధారణ అయి ఉన్నది అనే విషయము, వారి ఘనతను తెలియజేస్తున్నది.
- ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ‘వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకుంటారో వారికి సిఫారసు తప్పనిసరిగా ప్రసాదించబడుతుంది.
- స్వర్గములో ఆ అత్యున్నత స్థానము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కే ఇవ్వబడుతుంది అనే విషయం నిర్ధారణగా తెలిసినప్పటికీ, తనకు ఆ స్థానము ప్రసాదించమని అల్లాహ్’ను వేడుకొనండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ను కోరడంలో వారి వినయము, అణకువ, నమ్రత తెలుస్తున్నాయి.
- అల్లాహ్ యొక్క కరుణ, ఆయన యొక్క ఘనత అపారమైనవి – ఒక మంచి పనికి బదులుగా దాని ప్రసాదించబడే ప్రతిఫలాన్ని పదింతలుగా హెచ్చించి మరీ ప్రసాదిస్తాడు ఆయన.