- ఇందులో నమాజును జమాఅత్ తో ఆచరించుట వాజిబ్ (విధి) అనే విషయం తెలుస్తున్నది. ఎందుకంటే వికల్పము (ఆప్షన్) కేవలం విధిగా ఆచరించవలసిన విషయాలకే ఇవ్వబడుతుంది. (విధిగా ఆచరించవలసిన అవసరం లేని విషయాలకు వికల్పాలు అవసరం లేదు కదా)
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం “దానికి (అనుగుణంగా) స్పందించు” అనేది ఎవరైతే అదాన్ వింటారో వారందరికీ జమాఅత్’తో నమాజు ఆచరించుట వాజిబ్ (విధి) అని తెలియజేస్తున్నది. ఎందుకంటే దానికి సంబంధించి అసలు ఆదేశము “విధి” అనే.