- ఖుఫ్'లపై (మేజోళ్ళపై) మసహ్ చేయడం అనేది వుదూలో మాత్రమే అనుమతించబడినది. అదే గుసుల్ చేయవలసిన స్థితిలో ఉన్న వ్యక్తి (సాక్సులపై మసహ్ చేయకుండా) కాళ్ళను పూర్తిగా కడుగుతాడు.
- “ఖుఫ్ఫైన్” లపై మసహ్ చేయడం అంటే తడి చేతిని ఒకసారి వాటి పైభాగములో తడుముట, ఖుఫ్’ల క్రింది భాగములో కాదు.
- “ఖుఫ్”లపై మసహ్ చేయుటకు కండిషన్ ఏమిటంటే, వుజూ పూర్తిగా చేసుకున్న తరువాతే, అంటే కాళ్ళను కూడా నీటితో పూర్తిగా కడుగిన తరువాతే, వాటిని కాళ్ళకు తొడిగి ఉండాలి, ఆ ఖుఫ్’లు పరిశుద్ధమైనవి అయి ఉండాలి, అవి వుదూలో కాళ్ళు ఎంత భాగం విధిగా కడుగుట అవసరమో, అంత బాగం తప్పనిసరిగా కప్పుతు ఉండాలి, అలాగే ఖుఫ్’లపై మసహ్ అనేది ‘హదస్ అల్ అస్గర్’ స్థితిలో (నమాజు చదువుటకు తప్పనిసరిగా వుదూ చేయవలసిన స్థితిలో) ఉన్నవారు మాత్రమే చేయగలరు, అంతేకానీ ‘హదస్ అల్ అక్బర్’ స్థితిలో గానీ, లేక గుసుల్ విధిగా ఆచరించవలసిన స్థితిలో గానీ ఉన్నవారి కొరకు కాదు. అదే విధంగా ‘ఖుఫ్’లపై మసహ్ అనేది షరియత్ అమోదించిన కాలపరిమితిలో మాత్రమే చేయగలరు. అంటే స్థానికులు ఒకదినము మరియు ఒక రాత్రి వరకు, మరియు ప్రయాణీకులు మూడు దినములు, మరియు మూడు రాత్రుల వరకు మసహ్ చేయగలరు
- వుజూలో కాళ్ళు ఎంతవరకు కడుగుట అవసరమో అంత భాగాన్ని కప్పి ఉంచే ఏదైనా ‘ఖుఫ్’ నిర్వచనం క్రిందకే వస్తుంది – ఉదాహరణకు సాక్సులు మొదలైనవి. కనుక వాటిపై కూడా మసహ్ చేయుటకు అనుమతి ఉన్నది.
- ఈ హదీసు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నత వ్యక్తిత్వము మరియు ఉత్తమ బోధన విధానము తెలుస్తున్నాయి – వారు ముగీరా రజియల్లాహు అన్హు ను తన కాళ్ళనుండి ‘ఖుఫ్’లను తొలగించుట నుండి వారించి, వాటిని తాను సంపూర్ణంగా వుదూ చేసుకుని ఉన్న స్థితిలోనే కాళ్ళకు తొడిగినానని వివరిస్తూ, ఆయన హృదయం సంతృప్తి చెందేలా - ‘ఖుఫ్’లు/మౌజాలు/మేజోళ్ళు/సాక్సులపై మసహ్ చేయుటకు నియమాలను అర్థమయ్యేలా వివరించారు.