- ‘గుసుల్’ రెండు రకాలు: పాక్షిక గుసుల్ మరియు సంపూర్ణ గుసుల్. పాక్షిక గుసుల్ లో వ్యక్తి పరిశుద్ధత పొందే సంకల్పము చేస్తాడు, తన నోటిని పుక్కిలించి, ముక్కును నీటితో చీది వేసి, తరువాత తన శరీరంపై నీటిని పారించి, శుభ్రంగా స్నానం చేస్తాడు. సంపూర్ణ గుసుల్ ఆచరించే వ్యక్తి ఈ హదీథులో పేర్కొన్న విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా గుసుల్ చేసినారో ఆ విధంగా గుసుల్ ఆచరిస్తాడు.
- వీర్యాన్ని ఏ విధంగానైనా బయటకు తీసిన వ్యక్తికి, మరియు సంభోగములో పాల్గొన్న వ్యక్తికి వీర్యము బయటకు వచ్చినా రాకపోయినా, వీరందరికీ జనాబత్ స్థితి వర్తిస్తుంది.
- భార్యాభర్తలు ఒకరి మర్మాంగాలను మరొకరు చూడవచ్చు మరియు శుభ్రపరుచు కొనవచ్చు, మరియు ఒకే నీటి తొట్టి నుండి నీళ్ళు తీసుకుంటూ ఇద్దరూ ఒకేసారి స్నానం చేయవచ్చు అనడానికి ఇందులో అనుమతి కనిపిస్తున్నది.