- ఈ హదీసు ఇస్లాం యొక్క పునాది విషయాలలో ఒకటి మరియు ఇస్లామీయ న్యాయశాస్త్రము యొక్క మూల సూత్రాలలో ఒకటి, అది: “సందేహము ద్వారా నిర్ధిష్ఠత రద్దు చేయబడదు”. ఇందులో న్యాయ సూత్రము ఏమిటంటే “ఏ విషమైనా తాను ఉన్న స్థితిలోనే ఉంటుంది, దానికి భిన్నంగా నిరూపణ కానంతవరకు.”
- సందేహము పరిశుద్ధతను ప్రభావితం చేయలేదు. సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి పరిశుద్ధ స్థితిలోనే (ఉదూ చేసిన స్థితిలోనే) ఉంటాడు – దానికి భిన్నమైనది నిర్థారణగా నిరూపించబడనంత వరకు.