/ “మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వచ్చి...

“మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వచ్చి...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వచ్చి ఇలా అంటాడు: “ఎవరైనా ఉన్నారా నాకు మొరపెట్టుకునేవాడు (నాకు దుఆ చేసేవాడు) నేను అతని దుఆ కు స్పందిస్తాను; ఎవరైనా ఉన్నారా నన్ను ఏదైనా కోరుకునేవాడు, నేను అతనికి ప్రసాదిస్తాను; ఎవరైనా ఉన్నారా నా క్షమాభిక్ష కొరకు ప్రార్థించే వాడు, నేను అతడిని క్షమిస్తాను”.
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సర్వోన్నతుడు, సకల శక్తి సంపన్నుడు, పరమపవితృడైన అల్లాహ్ ప్రతి రాత్రి చివరి మూడవ భాగము మిగిలి ఉన్న సమయాన అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వస్తాడు. ఆయన తన దాసులను కోరుతాడు ఆ ప్రత్యేక సమయాన తనకు దుఆ చేయమని, తాను వారి దుఆలకు స్పందిస్తాను అని, అలాగే (ఆ ప్రత్యేక సమయాన) ఆలస్యం చేయకుండా తనను అడుగమని, తాను వారు కోరిన దానిని ప్రసాదిస్తాను అని, ఇంకా తన పాపాలను క్షమించమని (ఆ ప్రత్యేక సమయాన) తనకు మొరపెట్టుకోమని, తాను విశ్వాసులైన తన దాసులను క్షమిస్తానని.

Hadeeth benefits

  1. ఇందులో రాత్రి చివరి మూడవ భాగము యొక్క ఘనత, ఆ భాగములో (ఆ ప్రత్యేక సమయములో) ఆచరించు నమాజులు, అందులో చేయు దుఆలు, క్షమాభిక్షకై చేసుకునే వేడుకోళ్ళ ఘనత మరియు ప్రత్యేకత తెలుస్తున్నది.
  2. ఈ హదీసును విన్న వ్యక్తి ఆ ప్రత్యేక సమయాల ఘనతను గమనించి, ఆ సమయాలలో తన దుఆల స్వీకరణ కొరకు, వీలైనంత ఎక్కువగా ఆ సమయాల లాభం పొందే ప్రయత్నం చేయాలి.