“నా సహాబాలను అవమానించకండి (వారి పట్ల అవమానకరంగా మాట్లాడకండి), మీలో ఎవరైనా ఉహుద్ కొండంత బంగారాన్ని ఖర్చు చేసినా, అది వారిలో (సహాబాలలో) ఒకరు ఖర్చు చేసిన ‘ముద్’ లేక కనీసం ‘ముద్’లో సగం అంత దానికి కూడా సమానం కాదు.”...
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా సహాబాలను అవమానించకండి (వారి పట్ల అవమానకరంగా మాట్లాడకండి), మీలో ఎవరైనా ఉహుద్ కొండంత బంగారాన్ని ఖర్చు చేసినా, అది వారిలో (సహాబాలలో) ఒకరు ఖర్చు చేసిన ‘ముద్’ లేక కనీసం ‘ముద్’లో సగం అంత దానికి కూడా సమానం కాదు.”
ముత్తఫిఖ్ అలైహి
వివరణ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను అవమానించడాన్ని - ముఖ్యంగా ముహాజిర్ మరియు అన్సార్ సహాబాలలో ‘సాబిఖూనల్ అవ్వలీన్’ సహాబాలను అవమానించడాన్ని- వారి పట్ల అవమానకరంగా మాట్లాడడాన్ని నిషేధించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా తెలియజేసినారు: ప్రజలలో ఎవరైనా ఉహుద్ పర్వతానికి సమానమైన మొత్తంలో బంగారాన్ని ఖర్చు చేసినా, అతని ప్రతిఫలం తన సహాబాలలో ఒకరు ఖర్చు చేసిన ఒక “ముద్” లేదా కనీసం దానిలో సగం ఖర్చు చేసిన దాని ప్రతిఫలానికి కూడా చేరదు. ఇలా ఎందుకంటే, ఇస్లాం పట్ల సహాబాల యొక్క చిత్తశుధ్ధి, వారి సంకల్పాలలో నిజాయితీ, మక్కా విజయాని ముందు ఇస్లాం కు అత్యంత అవసరమైన సమయాలలో ఇస్లాం కొరకు వారు చేసిన ఖర్చు, వారి త్యాగాలు, ఇస్లాం కొరకు వారు చేసిన యుద్ధాలు. ఇవన్నీ ‘సాబిఖూనల్ అవ్వలీన్’ సహాబాలను, తరువాత తరువాత ఇస్లాం లోకి ప్రవేశించిన వారి కంటే ఉన్నత స్థానాలలో నిలబెడతాయి. ఒక “ముద్” అంటే ఓ మోస్తరుగా ఎదిన వ్యక్తి యొక్క దోసిట నిండుగా పట్టేటంత మొత్తము. సాబిఖూనల్ అవ్వలీన్: ఇస్లాం తొలి దినాలలో ఇస్లాం పట్ల తీవ్ర వ్యతిరేకత, ఇస్లాం స్వీకరించి ముస్లిములుగా మారుతున్న వారి పట్ల పీడన, దౌర్జన్యం, వారిని అమానవీయ శిక్షలకు గురిచేయబడుతున్న అటువంటి అత్యంత క్లిష్ట సమయం లోనూ ముందడుగు వేసి ఇస్లాం స్వీకరించి, ఇస్లాంకు దన్నుగా నిలిచిన సహాబాలు.
Hadeeth benefits
సహాబాలను అవమానించడం, వారిపట్ల అవమానకరంగా మాట్లాడడం నిషేధము, అది ఘోరమైన పాపాలలో (‘కబాఇర్’ లలో) ఒకటి.
Share
Use the QR code to easily share the message of Islam with others