- ఇందులో - చిన్నపిల్లలకు 'తౌహీద్'ను గురించి (అల్లాహ్ యొక్క ఏకత్వమును గురించి) మరియు 'ఆదాబ్'ను గురించి (ఆచార వ్యవహారాలు, సంస్కారము మర్యాదలను గురించి) నేర్పించడము యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.
- ఆచరణల యొక్క ప్రతిఫలం, ఆ ఆచరణలను అనుసరించి ఉంటుంది (అది హరామ్ ఆచరణా లేక హలాల్ ఆచరణా అనే దానిపై)
- నిజానికి ఇందులో ఉన్న ఆదేశం ఏమిటంటే - అల్లాహ్ పై సంపూర్ణ విశ్వాసము, నమ్మకము కలిగి ఉండడం. కేవలం ఆయన పైనే 'తవక్కుల్' (భరోసా) కలిగి ఉండడం, అన్ని వ్యవహారాలను అత్యుత్తమంగా చక్కదిద్దేవాడు కేవలం ఆయన మాత్రమే అని విశ్వసించడం.
- విధివ్రాతను విశ్వసించడం, అన్ని విషయాలు ముందుగానే నిర్దేశించబడి ఉన్నాయని విశ్వసించడం మరియు పూర్వ నిర్దిష్టమై ఉన్న విషయాలను పూర్తి సంతృప్తితో స్వీకరించడం.
- ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను వదిలి వేస్తాడో, అల్లాహ్ అతడిని కూడా, రక్షించకుండా వదలి వేస్తాడు.