- సమాధులపై మస్జిదులను (ఆరాధనాలయాలను) నిర్మించుట, లేక అలా నిర్మించబడిన మస్జిదులలో ప్రార్థనలు చేయుట (నమాజు ఆచరించుట), లేదా చనిపోయిన వారిని మస్జిదులలో ఖననం చేయుట – ఇవన్నీ హరామ్ (నిషేధము). షిర్క్’నకు దారితీసే ప్రతి కారణానికి ఆదిలోనే అడ్డుకట్టవేయుట.
- సమాధులపై మస్జిదులను (ఆరాధనా గృహాలను) నిర్మించుట, వాటిలో విగ్రహాలను, చిత్రపటాలను ఉంచుట యూదులు మరియు క్రైస్తవుల ఆచరణ. మరియు ఎవరైతే అలా చేస్తారో వారు యూదులను, క్రైస్తవులను అనుకరించినట్లే.
- ప్రాణుల చిత్రపటాలను చిత్రించుట నిషేధము.
- సమాధిపై మస్జిదును నిర్మించే వాడు, లేక అందులో విగ్రహాన్ని ప్రతిష్టించేవాడు సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సృష్టి మొత్తములో అత్యంత నీచుడు.
- షిర్క్’నకు దారితీసే ప్రతి కారణాన్ని ఆదిలోనే తుంచివేయడం ద్వారా, అడ్డుకట్ట వేయడం ద్వారా షరియత్ “తౌహీదు” ను సంపూర్ణంగా పరిరక్షిస్తుంది.
- ధర్మపరాయణులైన వారిని కీర్తించడంలో “అతి” చేయడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే అది “షిర్క్” లో పడటానికి ఒక ఉచ్చు లాంటిది.