- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ప్రేమ కలిగి ఉండుట, మరియు ఆ ప్రేమ - ఈ సృష్ఠిలోని మొత్తం సృష్ఠితాలలో దేని పట్లయినా ప్రేమ కలిగి ఉంటే, దాని కంటే కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రేమకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చుట ప్రతి ముస్లిం యొక్క విధి.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల పరిపూర్ణమైన ప్రేమకు నిదర్శనం: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ను అనుసరించడం, దానిని బలపరచడం, దానికి అండగా నిలవడం. దాని కొరకు తన ధనాన్ని మరియు ప్రాణాన్ని సైతం త్యాగం చేయడం.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ – ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను శిరసావహించుట, ఆయన వాక్కులని విశ్వసించుట, ఆయన నిషేధించిన వాటికి, ఖండించిన వాటికి దూరంగా ఉండుట, ఆయనను అనుసరించుట, ధర్మములో ‘బిద్’అత్’ ను విడనాడుట – మొదలైన వాటిని అపేక్షిస్తుంది (బిద్’అత్: ధర్మములో లేని కొత్త విషయాలను ధర్మము పేరిట అనుసరించుట) .
- (విశ్వాసులపై) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కు, మిగతా ప్రజల యొక్క హక్కు కంటే మిక్కిలి ఘనమైనది మరియు మిక్కిలి ఖచ్చితమైనది. ఎందుకంటే, అది మార్గ భ్రష్ఠత్వము నుండి సన్మార్గము వైపునకు రావడానికి, నరకము నుండి రక్షించబడి స్వర్గమును సాధించడానికి ఏకైక కారణం, ఏకైక మార్గాంతరం.