- ఒక వ్యక్తి ఎప్పుడూ అతి ముఖ్యమైన విషయాలలో, మరియు అత్యంత అవసరమైన విషయాలలో మాత్రమే నిమగ్నమై ఉండాలి. ఆ సమయానికి అవసరం లేని విషయాలను వదిలి వేయాలి. అలాగే అప్పటికి ఇంకా జరగని, ఉనికిలోనికి రాని విషయాలను గురించి అతిగా ప్రశ్నించడం మానుకోవాలి.
- అతిగా ప్రశ్నించడం విషయాలను సంక్లిష్టపరుస్తుంది, మరియు అనవసర సందేహాలకు, అనుమానాలకు తద్వారా అభిప్రాయభేదాలకు దారి తీస్తుంది. అలా చేయడం నిషేధము.
- ఇందులో నిషేధాలన్నింటినీ వదిలివేయమనే ఆదేశం ఉన్నది. ఎందుకంటే వాటిని వదిలివేయడం కష్టం కాదు కనుక. వాటన్నింటి పట్ల నిషేధము సాధారణమైన విషయం.
- ఇందులో ఆదేశించబడిన వాటిని శక్తి మేరకు చేయగలిగినంత చేయమనే ఆదేశం ఉన్నది. ఎందుకంటే ఆదేశించబడిన విషయం కష్టాన్ని కలిగించవచ్చు లేదా ఒకరు చేయలేకపోవచ్చు; అందుచేత ఒకరి సామర్థ్యానికి తగ్గట్టుగా, శక్తి మేరకు ఎంతగా చేయగలిగితే అంత చేయమని ఆజ్ఞ.
- ఏదైనా విషయాన్ని గురించి అతిగా ప్రశ్నించడం పట్ల నిషేధము: ధర్మ పండితులు ప్రశ్నలను రెండు వర్గాలుగా విభజించారు: వాటిలో ఒకటి మతపరమైన విషయాలలో అవసరమైన వాటిని బోధించే ఉద్దేశ్యంతో అడగబడే ప్రశ్నలు. ఇది అనుమతించబడినది; మరియు ఙ్ఞానవృద్ధి కొరకు అటువంటి ప్రశ్నలు అడగాలని ఆదేశించబడినది. రెండవది: ఏదైనా విషయానికి సంబంధించి మొండిపట్టుగా, లేదా కపటత్వముతో కూడిన వాదనకు ఒడిగట్టడం – ఇది నిషేధించబడింది.
- గతించిన జాతులలో జరిగిన విధంగా, అతిగా ప్రశ్నించడం అనేది తమ ప్రవక్త పట్ల ఆ సమాజం అవిధేయతకు పాల్బడేలా చేస్తుంది అనే హెచ్చరిక ఉన్నది.
- ఏ విషయంలోనైనా అతిగా ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు, మరియు ప్రవక్తలతో విభేదించడం వినాశనానికి కారణం అవుతుంది; ప్రత్యేకించి, ధర్మములో ఒక ముగింపుకు చేరుకోలేని విషయాలలో: ఉదాహరణకు అగోచర ఙ్ఞానానికి సంబంధించిన విషయాలు, పునరుత్థాన దినమునాటి పరిస్థితులకు సంబంధించిన విషయాలు.
- కఠినమైన విషయాల గురించి అతిగా ప్రశ్నించడం నిషేధము: ఇమాం అల్ ఔజాఈ ఇలా అన్నారు: ఒకవేళ అల్లాహ్ తన దాసుణ్ణి జ్ఞానం నుండి దూరం చేయాలనుకుంటే, ఆయన అతడి నాలుకపై భ్రమను, కుతర్కాన్ని ఉంచుతాడు. నేను అటువంటి వారిని ప్రజలలో అతి తక్కువ జ్ఞానవంతులుగా కనుగొన్నాను. ఇబ్న్ వాహబ్ ఇలా అన్నారు: “మాలిక్ ఇలా చెప్పడం విన్నాను: జ్ఞానం గురించి వివాదాలు మనిషి హృదయం నుండి జ్ఞానం యొక్క కాంతిని తీసివేస్తాయి.”