- ప్రవక్తలు మరియు సత్పురుషుల సమాధుల విషయంలో షరియత్ అనుమతించిన హద్దులను అతిక్రమించడం అనేది అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు వాటిని పూజించే వైపుకు తీసుకు వెళ్తుంది. కనుక ప్రతి ఒక్కరూ బహుదైవారాధనకు దారితీసే అలాంటి ప్రతి ఒక్క మార్గము పట్ల, ప్రతి ఒక్క మూలము పట్ల మరియు ప్రతి ఒక్క కారణం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- సమాధులలో ఖననం చేయబడి ఉన్నవారు అల్లాహ్ కు ఎంత దగ్గరి వారైనా (ఔలియాలైనా), ఆ సమాధులకు గౌరవ ప్రతిష్ఠలు ఆపాదిస్తూ, వాటిని అలంకరించడానికి, వాటిని పూజించడానికి ఆ సమాధుల దగ్గరకు వెళ్ళరాదు.
- సమాధులపై మస్జిదులు నిర్మించడం నిషేధించబడినది.
- సమాధులపై మస్జిద్ నిర్మించబడి లేకున్నా, జనాజా నమాజు చదవబడని మృతుని కొరకు ఆచరించే జనాజా నమాజు తప్ప, సమాధుల వద్ద (స్మశానంలో) మరి ఏ ఇతర నమాజు అయినా ఆచరించుట నిషేధించ బడినది.