- షరియత్ ప్రకారం – బంధుత్వపు బంధాలను కాపాడటం, వాటిని కొనసాగించడం, వాటిని జోడించి ఉంచడం అంటే నీతో సంబంధాలను తెంచేసుకున్న బంధువులను నీవు స్వయంగా వెళ్ళి కలవడం, నీతో చెడుగా వ్యవహరించిన వారిని క్షమించడం, నిన్ను తమ నుండి నిషేధించిన వారికి, అవసర సమయంలో అన్ని విధాలా సహాయం చేయడం. బంధుత్వపు బంధాలను నిలిపి ఉంచడం అంటే, వారు మనకు ఒక మంచి చేస్తే బదులుగా వారికి మంచి చేయడం లేదా మనకు వారేదైనా మంచి చేస్తే దానికి ప్రతిఫలం చెల్లించడం ఎంతమాత్రమూ కాదు.
- కనుక, బంధుత్వపు బంధాలను నిలిపి ఉంచడం అంటే – మనకు వీలైనంతలో వారికి సాధ్యమైనంత మంచిని చేయడం, అది ధనం రూపంలో నైనా కావచ్చును, వారి కొరకు దువా చేయడమైనా కావచ్చు, వారి కొరకు మంచి పనులు చేయమని ఆదేశించడం మరియు చెడుకు దూరంగా ఉండమని నివారించడం అయినా కావచ్చు లేదా వాటికి సమానమైనవి కావచ్చు అంటే మనకు వీలైనంతగా వారినుంచి కీడును దూరం చేయడం అన్నమాట.