- చేసిన పాపాన్ని అల్లాహ్ కప్పి ఉంచిన తరువాత, దానిని బహిరంగపరచడం అసహ్యమైన పని.
- చేసిన పాపపు పనిని బహిరంగంగా చెప్పుకోవడం, విశ్వాసులలో నైతిక పతనాన్ని వ్యాపింపజేస్తుంది.
- ఎవరినైతే అల్లాహ్ ఈ ప్రపంచములో (తన పరదా వెనుక) కప్పి ఉంచుతాడో, అల్లాహ్ పరలోకమునందు కూడా (అతడి పాపములను) కప్పి ఉంచుతాడు. ఇది తన దాసుల పట్ల సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క నిరుపమానమైన కరుణ.
- ఎవరైతే పాపపు పనికి ఒడిగడతాడో, అతడు తనను తాను (బహిరంగ పరచకుండా) కప్పి ఉంచుకోవాలి మరియు పాపపు పనికి పాల్బడినందుకు అల్లాహ్ సమక్షమున పశ్చాత్తాపము చెందాలి.
- చేసిన పాపపు కార్యాన్ని ఉద్దేశ్యపూర్వకంగా బహిరంగంగా ప్రకటించుకునే వాని భయంకరమైన అపరాధం ఏమిటంటే – ఆ కారణంగా అతడు అల్లాహ్ చేత క్షమించబడే అవకాశాన్ని కోల్పోతాడు.