/ “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”...

“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘లైలతుల్ ఖద్ర్’ లో అల్లాహ్ యొక్క ఆరాధనలలో గడపడం యొక్క ఘనతను తెలియ జేస్తున్నారు. అది రమజాన్ నెల ఆఖరి పది రాత్రులలో వస్తుంది. ఎవరైతే ఆ రాత్రి యందు ప్రదర్శనా బుద్ధి లేకుండా, పేరుప్రఖ్యాతుల కొరకు కాకుండా, శ్రధ్ధగా నమాజులలో, ఖుర్’ఆన్ పారాయణంలో, అల్లాహ్ ధ్యానములో మరియు ఆయనను వేడుకొనుటలో; ఆ రాత్రి యొక్క ఘనతను విశ్వసిస్తూ మరియు ఆ రాత్రి గురించి ఏమి అవతరించబడినదో దానిలో పూర్తి విశ్వాసముతోను; మరియు అందుకు గానూ అల్లాహ్ ప్రసాదించే పుణ్యఫలంపై ఆశతోనూ గడుపుతాడో, అటువంటి వాని పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి.

Hadeeth benefits

  1. ఇందులో ‘లైలతుల్ ఖద్ర్’ యొక్క ఘనత మరియు దానిని పొందుట కొరకు ప్రోత్సాహమూ ఉన్నాయి.
  2. సత్కార్యాలు ఏవైనా సరే, వాటిని ఆచరించడం వెనుక స్వచ్ఛమైన సంకల్పము ఉంటే తప్ప అవి స్వీకరించబడవు.
  3. ఇందులో అల్లాహ్ యొక్క ఘనత మరియు ఆయన కారుణ్యమూ తెలుస్తున్నాయి. నిశ్చయంగా ఎవరైతే లైలతుల్ ఖద్ర్ లో అల్లాహ్ యందు విశ్వాసముతో, అల్లాహ్ ప్రసాదించే పుణ్యఫలం పట్ల ఆశతో – అల్లాహ్ యొక్క ఆరాధనలో గడుపుతాడో, (అల్లాహ్ యొక్క కారుణ్యముతో) అతడి పూర్వపు పాపాలన్ని క్షమించి వేయడతాయి.