- ఇందులో హృదయాన్ని సంస్కరించడం వైపునకు మరియు దాని నుండి ప్రతి చెడును దూరం చేసి దానిని పరిశుధ్ధ పరచుట వైపునకు శ్రధ్ధ తీసుకోవడం కనిపిస్తుంది.
- హృదయం యొక్క ధర్మబధ్ధత దాని యొక్క నిష్కాపట్యముపై ఆధారపడి ఉంటుంది; అలాగే ఆచరణల యొక్క ధర్మబధ్ధత, అవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానానికి అనుగుణంగా ఉన్నాయా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. మరియు ఇవే అల్లాహ్ వద్ద పరిశీలించబడతాయి.
- ఒక వ్యక్తిని అతడి సంపద, అతడి సౌందర్యము, అతడి దేహము, లేక ఈ ప్రపంచపు నూతన పోకడలు అతడిని మోసములో పడవేయరాదు.
- ఇందులో అంతరంగ పరిశుధ్ధత ముఖ్యమని, బాహ్యంగా కనిపించే దానిపై ఆధారపడరాదని హెచ్చరిక ఉన్నది.