/ “విశ్వాసి తన సత్ప్రవర్తన, సభ్యత, ఉత్తమ నడవడికల ద్వారా పుష్కలంగా సలాహ్ (నమాజు) లు మరియు ఉపవాసాలు ఆచరించే వాని స్థాయిని పొందుతాడు”...

“విశ్వాసి తన సత్ప్రవర్తన, సభ్యత, ఉత్తమ నడవడికల ద్వారా పుష్కలంగా సలాహ్ (నమాజు) లు మరియు ఉపవాసాలు ఆచరించే వాని స్థాయిని పొందుతాడు”...

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “విశ్వాసి తన సత్ప్రవర్తన, సభ్యత, ఉత్తమ నడవడికల ద్వారా పుష్కలంగా సలాహ్ (నమాజు) లు మరియు ఉపవాసాలు ఆచరించే వాని స్థాయిని పొందుతాడు”.

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్ప్రవర్తన కలిగి ఉండుట యొక్క ఘనతను వివరిస్తున్నారు. సత్ప్రవర్తన, మర్యాద, సభ్యతలు వాటిని కలిగి ఉన్న వ్యక్తిని, ప్రతి దినమూ క్రమం తప్పకుండా పగలంతా ఉపవాసము పాటించి రాత్రంతా నమాజులలో గడిపే వాని స్థాయికి చేరుస్తుంది. సత్ప్రవర్తన: సత్కార్యాలు చేయుట, సంభాషణలో మెతకదనం కలిగి ఉండుట, ముఖములో ఎటువంటి సంకోచమూ లేకుండుట, ఎవరికైనా హాని, నష్టము కలిగించుట నుండి దూరంగా ఉండుట, ఎవరైనా తనకు హాని, నష్టము కలిగిస్తే సహనం వహించుట - సత్ప్రవర్తన అంటే వీటన్నింటి కలయిక.

Hadeeth benefits

  1. ఈ హదీసు ద్వారా ఇస్లాం నైతిక విలువలకు మరియు వాటి పరిపూర్ణతకు ఉత్తమ స్థానం ఇస్తుందని తెలుస్తున్నది.
  2. సత్ప్రవర్తన, ఉత్తమ నడవడికల ఘనత ఏమిటంటే, వాటి ద్వారా దాసుడు – నిరంతరం ఉపవాసాలు పాటించే వాని స్థాయికి, మరియు నిరంతరం నమాజులో నిలబడినా ఏమాత్రమూ అలసట ఎరుగని వాని స్థాయికి చేరుకుంటాడు.
  3. పగలంతా ఉపవాసములో గడుపుట మరియు రాత్రంతా నమాజులో నిలబడుట – ఇవి రెండూను ఎవరిపైనైనా అతి భారమైన మరియు కఠినతరమైన ఆచరణలు. సత్ప్రవర్తన మరియు ఉత్తమ నడవడిక కలిగిన వ్యక్తి ఆ విధంగా ఉపవాసాలు పాటించే మరియు నమాజులు ఆచరించే వాని స్థాయికి చేరుకుంటాడు – ఎందుకంటే ఇతను కూడా అన్ని వేళలా సత్ప్రవర్తన, ఉత్తమ నడవడిక కలిగి ఉండడానికి అంతగా కష్టపడతాడు కనుక.