- అల్లాహ్ తన దాసుల కొరకు ఈ ప్రపంచములో ధర్మబద్ధం చేసిన (హలాల్) విషయాల ద్వారా సంతోషాన్ని, ఆనందాన్ని పొందవచ్చును. దానికి అనుమతి ఉంది. అయితే ఏ విషయం లోనూ హద్దు మీరరాదు, అలాగే ఏ విషయంలోనూ అతిశయానికి, డాంబికానికి వెళ్ళరాదు.
- అలాగే ఈ హదీథులో మంచిభార్యను ఎంచుకోవాలి అనే ప్రోత్సాహము ఉన్నది. ఎందుకంటే ఆ ఎంపిక తన ప్రభువు యొక్క ఆదేశాలను అనుసరించడానికి ఆ భర్తకు సహాయపడుతుంది.
- ఈ ప్రపంచపు అత్యుత్తమ సంతోషము, ఆనందము అల్లాహ్ (యొక్క ఆదేశాల) ను అనుసరించుటలో లేక అందుకు సహకరించుటలో ఉన్నది.