- ఒక వ్యక్తి తన విధులను నిర్వర్తించే సామర్థ్యము నిద్రవల్ల కోల్పోతాడు, నిద్ర అతడిని మేల్కొని తన విధులను నిర్వర్తించడం నుండి నిరోధిస్తుంది; లేక వయసులో చిన్నతనం, మరియు బాల్యము అనేవి ఆ పిల్లవానిని విధులను నిర్వర్తించేందుకు అనర్హుడిగా చేస్తాయి; లేక పిచ్చితనం (మతిస్థిమితం లేకపోవడం) అనేది అతని మానసిక వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తుంది. ఆ విధంగా పైన పేర్కొనబడిన ఈ మూడు కారణాల వల్ల ఎవరైతే సరైన వివక్ష మరియు అవగాహనను కోల్పోతాడో, అతడు విధులను సక్రమంగా నిర్వర్తించే తన సామర్థ్యాన్ని కోల్పోతాడు. ఆ కారణంగా శుభాల ప్రదాత, అమితంగా అనుగ్రహించేవాడూ, అపరిమితంగా సహనమూ, ఔదార్యమూ, దయాదాక్షిణ్యాలు కలవాడూ, పరమ న్యాయమూర్తి, సర్వోన్నతుడు అయిన అల్లాహ్, తన దాసుడు తనకు వ్యతిరేకంగా అతడు చేసిన ఏదైనా అతిక్రమణ, లేదా నిర్లక్ష్యం, లేదా తన హక్కులలో దేనిలో నైనా అతనివల్ల కొరత జరిగితే, ఆ కారణంగా అతనికి విధించబడే శిక్షను అతడి నుండి లేపివేసాడు.
- పైన పేర్కొనబడిన ముగ్గురి వల్ల ఒకవేళ ఏదైనా తప్పు, లేక పాపకార్యము జరిగితే (అల్లాహ్ వద్ద) అవి రాయబడక పోవుట అనేది ప్రపంచ న్యాయవ్యవస్థకు చెందిన చట్టాలకు ఏ విధంగానూ వ్యతిరేకం కాదు. ఉదాహరణకు ఒక పిచ్చివాని వల్ల ఎవరి ప్రాణం అయినా పొతే, తత్కారణంగా, చట్ట ప్రకారం అతనిపై ప్రతీకారం తీర్చుకొనుట, లేక చట్ట ప్రకారం అతనిపై పరిహారం విధించుట అనేవి ఉండవు. అయితే అతని కుటుంబము ‘రక్త ధనము’ తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది.
- యుక్త వయస్సు: ఇది మూడు సంకేతాల ద్వారా నిర్ధారించబడుతుంది. స్వప్నస్ఖలనం ద్వారా గానీ, లేక మరింకే విధంగానైనా గానీ వీర్యము యొక్క ఉద్గారము కావడం; నాభి క్రింది భాగములో వెంట్రుకలు మొలవడం; లేదా 15 సంవత్సరాల వయస్సు రావడం. స్త్రీల కొరకు నాలుగవ సంకేతం – వారు ఋతుస్రావానికి (బహిష్టుకు) గురికావడం.
- ఇమాం అస్’సుబ్కీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “బాలుడు అంటే పిల్లవాడు. మరొకరు ఇలా అన్నారు: పిల్లవాడు తన తల్లి గర్భములో ఉన్నపుడు పిండం అని పిలువబడతాడు; అతడు జన్మించినపుడు శిశువు అనబడతాడు. తల్లి పాలు త్రాగడం నుండి ఏడు సంవత్సరాల వయస్సు వరకు అతడు బాలుడుగా ఉంటాడు. పది సంవత్సరాల వయస్సు అతని కౌమారదశ, పదిహేను సంవత్సరాల వయస్సులో అతడు యువకుడు అనబడతాడు. ఈ దశలన్నింటిలోనూ అతణ్ణి బాలుడు అని పిలుస్తారన్నదే నిజం.” ఈ మాటలు అన్నది ఇమాం అస్సుయూతీ (రహిమహుల్లాహ్).