వివరణ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా (రదియల్లాహు అన్హా) కు సమగ్రమైన దుఆలను నేర్పించినారు, అవి నాలుగు దుఆలు:
మొదటిది: సాధారణంగా అంతా మంచి జరగాలని కోరుకుంటూ చేసే దుఆ (అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి కుల్లిహి) – ఓ అల్లాహ్! నేను ప్రతి శుభాన్ని ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాను; అది సమీప భవిష్యత్తు లోనిదైనా, లేక చాలా దూరంగా ఉన్నదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నదైనా (నీవు నాకు బోధించినది అయినా), దానిని గురించిన ఙ్ఞానము నాకు లేకపోయినా (అది కేవలం నీ ఙ్ఞానపరిధి లోనిది అయినా), ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు, ఘనత అంతా నీకే చెందును. ఇందులో, అన్ని విషయాల ఙ్ఞానం కలవాడు, సర్వజ్ఞుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్’కు విషయాన్ని అప్పగించడం వలన మహిమాన్వితుడైన అల్లాహ్ ముస్లిం కోసం ఉత్తమమైనది మరియు అత్యంత శ్రేష్ఠమైనది ఎంపిక చేస్తాడు. అందుకని నేను ఆయన క్షమాభిక్షను గట్టిగా పట్టుకుని ఆయన ఆశ్రయం పొందుతాను - ప్రతి చెడు నుండి, ప్రతి కీడు నుండి, వినాశం కలిగించే ప్రతి దాని నుండి, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా.
రెండవ దుఆ: ఇది దుఆలో అతిక్రమించకుండా ముస్లింకు ఒక రక్షణ వంటిది (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక) ఓ అల్లాహ్! నేను నిన్ను అడుగుతున్నాను, మరియు కోరుతున్నాను (మిన్ ఖైరి మా సఅలక అబ్దుక వ నబియ్యుక) నీ దాసుడు మరియు నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను కోరిన మంచినంతా; (వ అఊదు) మరియు నీ రక్షణ కోరుతున్నాను, నీ ఆశ్రయం కోరుతున్నాను, వేడుకుంటున్నాను - నీ దాసుడు మరియు నీ ప్రవక్త రక్షణ ప్రసాదించమని, నీ ఆశ్రయం ప్రసాదించమని కోరిన చెడు నుండి, కీడు నుండి. ఇది అల్లాహ్ తరఫు నుండి ఒక దుఆ, ఒక ప్రార్థన, దుఆ చేయు వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కొరకు ఏదైతే ప్రార్థించినారో, అవి ఏమిటి అనే వివరణలు ఏవీ లేకుండా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించిన వాటినన్నింటినీ, దుఆ చేయు వ్యక్తికి ప్రసాదించుటకు గాను.
మూడవ దుఆ: స్వర్గములో ప్రవేశింపజేయుట కొరకు మరియు నరకాగ్ని నుండి దూరంగా ఉంచుట కొరకు చేయు దుఆ. ఇది ప్రతి ముస్లిం యొక్క కోరిక మరియు అతని ఆచరణలన్నింటి లక్ష్యం. (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలౌకల్ జన్నహ్) ఓ అల్లాహ్! నేను స్వర్గము కొరకు నిన్ను అడుగుతున్నాను. దానిని సాధించాలని, మరియు దానికి చేరువ చేసే మరియు నిన్ను సంతోష పరిచే ప్రతి మంచి మాట, ప్రతి మంచి పని కొరకు నిన్ను అడుగుతున్నాను. (వ అఊజుబిక మినన్నార్) మరియు నరకాగ్ని నుండి నీ రక్షణ మరియు శరణు కోరుతున్నాను – ఎందుకంటే చెడు పనుల నుండి నీ కరుణ, మరియూ కృప తప్ప వేరే రక్షణ లేదు; (వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్) అలాగే నరకాగ్నికి చేరువ చేసే ప్రతి పలుకు మరియు ప్రతి పని నుండి కూడా (నీ రక్షణ మరియు శరణు కోరుతున్నాను).
నాలుగవ దుఆ: అల్లాహ్ తీర్పు పట్ల, ఆయన అదేశాల సంతృప్తి కొరకు దుఆ, ప్రార్థన (వ అస్అలుక అన్’తజ్అల్ కుల్ల ఖదాఇన్, ఖదైతహు ఖైరన్) మరియు (ఓ అల్లాహ్!) నీవు నా కోరకు నిర్ణయించిన ప్రతి ఉత్తర్వును, ప్రతి ఆదేశాన్ని, నా కొరకు మంచిదిగా చేయమని నేను నిన్ను అడుగుతున్నాను. ఇది అల్లాహ్ యొక్క ప్రతి తీర్పు, ప్రతి ఆదేశం పట్ల తృప్తి కోసం చేయు దుఆ, ప్రార్థన.