- ఈ హదీసు సూరతుల్ బఖరహ్ యొక్క చివరి ఆయతుల ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నది. ఈ ఔన్నత్యము “ఆమనర్రసూలు బిమా ఉన్’జిల ఇలైహి మిర్రబ్బిహిమ్...” (ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసిం చాడు....) అనే అల్లాహ్ వాక్కులతో మొదలై, సూరహ్ చివరి వరకు కొనసాగుతుంది.
- ఎవరైతే సూరతుల్ బఖరహ్ యొక్క ఈ చివరి భాగము రాత్రి పడుకోబోయే ముందు పఠిస్తారో, అతని నుండి కీడు, చెడు మరియు షైతానులను అది దూరం చేస్తుంది.
- రాత్రి సూర్యుడు అస్తమించడంతో ప్రారంభమవుతుంది, మరియు సూర్యుడు ఉదయించడంతో ముగుస్తుంది.