- ఈ హదీథులో శుభం కలిగినపుడు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలుపుకోవడం, కష్టం కలిగినపుడు సహనం వహించడం – ఈ రెండు గుణాలు కలిగి ఉండుట యొక్క ఘనత తెలియు చున్నది. ఎవరైతే ఇలా చేస్తారో అతడు ఇహపరలోకాల శుభాలను పొందుతాడు. అలాగే ఎవరైతే అల్లాహ్ ప్రసాదించిన శుభాల పట్ల కృతజ్ఞుడై ఉండడో, మరియు కష్టం సంభవించినపుడు సహనం వహించడో అతడు ఇహపరలోకాల శుభాలను కోల్పోతాడు మరియు పాపాన్ని మూటగట్టుకుంటాడు.
- ఇందులో విశ్వాసము కలిగి ఉండుట యొక్క ఘనత, మరియు ప్రతి స్థితిలోనూ కేవలం విశ్వాసం కలిగి ఉన్న వారు మాత్రమే (విశ్వాసులు మాత్రమే) శుభాలు పొందుతారు అని తెలియుచున్నది.
- అల్లాహ్ యొక్క పూర్వనిర్దేశాన్ని (విధివ్రాతను) విశ్వసించే వ్యక్తి ప్రతి స్థితిలోనూ అతడు సంపూర్ణంగా సంతృప్తిని కలిగి ఉంటాడు. అదే అవిశ్వాసి తనపై కష్టాలు వచ్చి పడినపుడు అసంతృప్తిలో పడిపోతాడు, శుభాలు కలిగినపుడు, ఆ శుభాలు తీసుకువచ్చిన సిరిసంపదలలో పడిపోయి, వాటిని అల్లాహ్ యొక్క విధేయతకు అనుగుణమైన వాటిలో ఖర్చుచేయడం అటుంచి, అల్లాహ్ యొక్క విధేయతకు దూరమైపోతాడు.
- అల్లాహ్ యొక్క పూర్వనిర్దేశాన్ని (విధివ్రాతను) విశ్వసించే వ్యక్తి ప్రతి స్థితిలోనూ అతడు సంపూర్ణంగా సంతృప్తిని కలిగి ఉంటాడు. అదే అవిశ్వాసి తనపై కష్టాలు వచ్చి పడినపుడు అసంతృప్తిలో పడిపోతాడు, శుభాలు కలిగినపుడు, ఆ శుభాలు తీసుకువచ్చిన సిరిసంపదలలో పడిపోయి, వాటిని అల్లాహ్ యొక్క విధేయతకు అనుగుణమైన వాటిలో ఖర్చుచేసే మాట అటుంచి, అల్లాహ్ యొక్క విధేయతకు దూరమైపోతాడు.