- ఈ హదీసు ద్వారా ధర్మానికి కట్టుబడి ఉండడం విధి అని, మరియు అవరోధాలు వచ్చి అడ్డుకోకముందే మంచి పనులు చేయడంలో త్వరపడాలని తెలుస్తున్నది.
- ఈ హదీసులో పేర్కొనబడిన విషయం ప్రపంచం అంతమయ్యే చివరి దినాలలో వరుసగా వచ్చి పడే కష్టాలకు, అరాచక ఘటనలకు సంకేతం. అప్పుడు ఒక కష్టం తీరిపోతుందో లేదో వెంటనే మరో కష్టం వచ్చిపడుతుంది.
- ఒక వ్యక్తి ధర్మానుసరణలో బలహీనపడి, అతను డబ్బు లేదా ఇతర వస్తువుల వంటి ప్రాపంచిక విషయాలకు బదులుగా దానిని వదులుకుంటే, అది అతడు ధర్మమార్గము నుండి మార్గభ్రష్ఠుడు కావడానికి, ధర్మాన్ని విడిచిపెట్టడానికి మరియు ప్రలోభాలకు దారితీయడానికి కారణం అవుతుంది.
- సత్కార్యాలు ప్రలోభాల నుండి విమోచనానికి చేర్చే కారణాలలో ఒకటి అని ఈ హదీసు ద్వారా నిరూపణ అవుతున్నది.
- “ఫిత్నహ్” (ఆకర్షణ, కష్టము, అరాచకత్వము మొ.) రెండు రకాలు. సందేహాల ‘ఫిత్నహ్’: దీనికి చికిత్స జ్ఞానము. వాంఛల ‘ఫిత్నహ్’: దీనికి చికిత్స బలమైన విశ్వాసము మరియు సహనము, ఓర్పు.
- ఎవరైతే తక్కువగా మంచిపనులు చేస్తారో, అటువంటి వారు తేలికగా ప్రలోభాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది, అలాగే ఎవరైతే ఎక్కువగా మంచిపనులు చేస్తారో వారు తాము చేసిన మంచి పనులను చూసుకుని మోసపోరాదని ఈ హదీసు ద్వారా తెలుస్తున్నది.