- ఇందులో, సూర్యుడు వేటివేటిపై ఉదయిస్తాడో, వాటన్నింటి కంటే అల్లాహ్ అత్యంత ప్రియమైన వాడు అనీ, ఆయన ఘనతను స్తుతించాలనీ, కీర్తించాలనీ ప్రోత్సహించ బడుచున్నది.
- అలాగే ఇందులో - అల్లాహ్ యొక్క జిక్ర్ (ఆయనను స్తుతించుట, కీర్తించుట) వలన లభించే ప్రతిఫలము మరియు శుభాల కారణంగా, వీలైనంత ఎక్కువగా అల్లాహ్ ధ్యానం చేయాలనే హితబోధ ఉన్నది.
- ఈ ప్రపంచపు వినోదాలు, భోగాలు, సౌఖ్యాలు అత్యంత అల్పమైనవి మరియు ఈ ప్రపంచపు వాంఛలు, కోరికలు క్షణభంగురమైనవి, క్షణికమైనవీనూ.