/ “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్...

“ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్...

అబీ ఉసైద్ ఉల్లేఖించిన హదీసును అబీ హుమైద్ ఇలా తెలిపినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులోనికి ప్రవేశించే ముందు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక) వైపునకు ముస్లిం సమాజాన్ని మార్గదర్శనం చేస్తున్నారు. అతడు మస్జిదులోనికి ఆరాధన (ఇబాదత్) కొరకు ప్రవేశించడానికి ముందు అతడు తన ప్రభువు యొక్క కరుణ కొరకు దువా చేస్తున్నాడు. అలాగే అతడు మస్జిదు నుండి బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నపుడు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్’లిక) వైపునకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆ దుఆ పలుకడం ద్వారా అతడు తనకు ధర్మబద్ధమైన ఉపాధి కొరకు, అందులో అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని, దయను, కనికరాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాడు.

Hadeeth benefits

  1. ఈ హదీసులో తెలుపబడిన దుఆలు మస్జిదులోనికి ప్రవేశించునపుడు మరియు మస్జిదు నుండి బయటకు వచ్చునపుడు పలుకుట అభులషణీయము (ముస్తహబ్).
  2. మస్జిదులోనికి ప్రవేశించునపుడు కరుణ కొరకు మరియు బయటకు వచ్చునపుడు అనుగ్రహం మరియు దయ కొరకు వేడుకొనుట ఈ దుఆల యొక్క ప్రత్యేకత: మస్జిదులోనికి ప్రవేశించు వ్యక్తి తన సృష్టికర్తను ఆరాధించుట కొరకు ప్రవేశిస్తాడు. ఆ ఆరాధనలు (ఇబాదత్’లు) అతడిని తన ప్రభువు దగ్గరికి చేరుస్తాయి, ఆయన అతడిని స్వర్గానికి చేరువ చేస్తాడు. కనుక తన ఆరాధనలు స్వీకరించి తనను కరుణించమని ప్రార్థించుట సరియైనదే. అలాగే మస్జిదు నుండి బయటకు వచ్చే వ్యక్తి బయట ప్రపంచములోనికి ప్రవేశిస్తాడు. అందులో అతడు తన ఉపాధి కొరకు కష్టపడి పనిచేయవలసి వస్తుంది. కనుక ధర్మబధ్ధమైన ఉపాధి సంపాదన కొరకు తనను అనుగ్రహించమని, తనపై దయ చూపమని దుఆ చేయడం ఆ సందర్భములో సరియైనదే.
  3. ఆ దుఆలు మస్జిదులోనికి ప్రవేశించునపుడు మరియు మస్జిదు నుండి బయటకు వచ్చునపుడు చేయ వలసి ఉన్నది.