/ “స్త్రీల కంటే ఎక్కువగా మగవారికి హాని కలగజేసే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు”...

“స్త్రీల కంటే ఎక్కువగా మగవారికి హాని కలగజేసే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు”...

ఉసామా ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్త్రీల కంటే ఎక్కువగా మగవారికి హాని కలగజేసే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు”.
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పేర్కొన్నారు: ‘స్త్రీల కంటే ఎక్కువ మగవారికి హాని కలిగించే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు’. ఒకవేళ ఆమె కుటుంబంలోని వ్యక్తి అయితే షరియత్ కు వ్యతిరేకంగా ఆమె పాల్బడే పనులలో అతడు ఆమె అడుగుజాడల లెక్క తీసుకోవచ్చు; ఒకవేళ ఆమె అతనికి పరిచయం లేని వ్యక్తి అయితే, అతడు ఆమెను కలవడం, ఇంకా ఆమెతో ఒంటరితనం – తత్కారణంగా ఉత్పన్నమయ్యే కీడు, చెడు – ఇవన్నీ కూడా అతడిని ‘ఫిత్నా’లో పడవేసే కారణాలే.

Hadeeth benefits

  1. ఒక విశ్వాసి, స్త్రీల దురాకర్షణల పట్ల జాగరూకుడై ఉండాలి. ఆమె కారణంగా ఉత్పన్నమయ్యే ప్రతి దురాకర్షణను ముందుగానే అడ్డుకట్ట వేయాలి.
  2. అన్నిరకాల దురాకర్షణల నుండి, విశ్వాసి అన్నివేళలా అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉండాలి, మనసు ఆయన వైపునకే లగ్నమై ఉండేలా చూసుకోవాలి.