- ఈ హదీథులో – ఈ ప్రపంచపు ఆకర్షణలలో పడి అందులో మునిగి పోకుండా, ధర్మవర్తనులై ఉండాలనే హితబోధ ఉన్నది.
- స్త్రీల వ్యామోహములో పడిపోయే పనులపట్ల జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక ఉన్నది – ఉదాహరణకు వారిని (అదే పనిగా) చూడడం, వారితో కలవడాన్ని తేలికగా తీసుకోవడం మొదలైనవి.
- స్త్రీల పట్ల వ్యామోహం, ఆకర్షణ అనేవి ఈ ప్రపంచములో అన్నింటికన్నా పెద్ద పరీక్షలు.
- ఈ హదీసులో గతించిన జాతులకు జరిగిన పరాభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం కనిపిస్తుంది. ఉదాహరణకు ఇస్రాయీలు సంతతికి జరిగిన పరాభవమే మిగతా జాతులకూ జరుగవచ్చు.
- స్త్రీ వ్యామోహము : ఆమె అతని భార్య అయినట్లయితే, ఆమెపై వ్యామోహం అతని స్థాయి, స్థోమతకు మించి ఖర్చుచేయడానికి కూడా వెనుకాడనంత వరకు వెళుతుంది; అతడు ధార్మికపరమైన ఆచరణలు ఆచరించడానికి కూడా సమయం లేనంతగా అతనికి తీరిక లేకుండా చేస్తుంది, మరియు ఆమె వ్యామోహంలో ఈ ప్రాపంచిక జీవితం లో మునిగి పోవడం ద్వారా అలసిపోయేలా చేస్తుంది. ఒకవేళ ఆమె పరాయి స్త్రీ అయినట్లయితే ఆమె పట్ల వ్యామోహం (మరింత ప్రమాదకరమైనది, అది) – అతడిని సత్యము నుండి మరలి పోయేలా చేస్తుంది, వారు బయటకు వెళ్ళినా మరియు వారు ఒకరినొకరు కలిసినా; ప్రత్యేకించి ఆ స్త్రీ బాగా అలంకరించుకుని, తనను తాను తగినంతగా కప్పుకోకుండా తిరిగే స్త్రీ అయితే (తిరుగుబోతు స్త్రీ) అటువంటి స్త్రీతో సాంగత్యము, అటువంటి స్త్రీ పై వ్యామోహము వ్యభిచారపు అనేక స్థాయిలకు అతడిని లాగుకుని వెళుతుంది. అందుకని విశ్వాసి ఎప్పుడూ అటువంటి ప్రమాదం లో పడకుండా ఉండడానికి అల్లాహ్ యొక్క రక్షణ కోరుతూ ఉండాలి, అటువంటి స్త్రీల ఫిత్నా (ఉపద్రవం) నుండి ఎప్పుడూ దూరంగా ఉండాలి.