- పరాయి స్త్రీలను కలవడం, వారితో ఒంటరిగా ఉండడంపై నిషేధం ఎందుకంటే అది దారితీసే అనైతికత, అనాపేక్షిత పరిణామాలను ముందుగా అడ్డుకోవడం, ముందుగానే దానికి అడ్డుకట్టవేయడం దాని అసలు ఉద్దేశ్యము గనుక.
- ఈ నిషేధము సాధారణంగా పరాయి పురుషులకు వర్తిస్తుంది, అంటే మహిళకు మహ్రం కాని బంధుత్వం ఉన్న పురుషులు (ఆమెతో వివాహానికి అభ్యంతరం లేని బంధుత్వం ఉన్న పురుషులు). ఇందులో అటువంటి బంధుత్వం ఉన్న భర్త తరఫు పురుషులు, మరియు పరాయి పురుషులు అందరూ వస్తారు.
- తప్పులో పడిపోయే ప్రమాదం ఉంటుంది అనే భయంతో తప్పు జరగడానికి సాధారణంగా అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలనుండి దూరంగా ఉండాలి.
- ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “అరబీ భాషా పండితులు “అల్-అహ్మాఅ” అంటే భర్త తరఫు బంధువులు – అంటే అతడి తండ్రి, చిన్నాన్న, పెదనాన్నలు, అతని సోదరులు, వారి పిల్లలు, అతని కజిన్ (చిన్నాన్న, పెదనాన్న సంతానం) మొదలైన వారు అని; “అల్-అఖ్’తాన్” అంటే భార్య తరఫు బంధువులు అని; అలాగే “అల్-అస్’హార్” అంటే ఇద్దరి తరఫు బంధువులు అని ఏకాభిప్రాయంగా స్థిరపరచినారు.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్-హమ్’వ” ను మరణంతో సమానము అన్నారు: దీనిని ఇమాం ఇబ్న్ హజర్ (రహిమహుల్లాహ్) ఇలా వివరించినారు: అరబ్బులు ద్వేషించదగిన దేనినైనా ‘మరణం’ తో పోలుస్తారు. ఇక్కడ మరణంతో సారూప్యత ఏమిటంటే; పాప కార్యము సంభవించినట్లయితే అక్కడ ధర్మము మరణించినట్లే; మరియు పాపకార్యము సంభవించినపుడు ఏకాంతంలో అందులో పాలుపంచుకున్న వానిపై “రజం” శిక్ష వాజిబ్ అవుతుంది. పర్యవసానంగా అందులో పాలుపంచుకున్న స్త్రీ భర్త, అసూయ కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చివేస్తాడు; ఆమె జీవితం నాశనం అవుతుంది.