/ “నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.”...

“నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.”...

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.”
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ప్రజలలో ఎవరైతే ఏదైనా విషయంపై విపరీత స్థాయిలో జగడానికి దిగుతాడో లేక ఎక్కువగా అలాంటి జగడాలు పెట్టుకుంటాడో అటువంటి వానిని పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు, స్వయం సమృధ్ధుడూ అయిన అల్లాహ్ అసహ్యించుకుంటాడు. అటువంటి వాడు సత్యానికి విధేయత చూపడు. తన వాదనలతో సత్యాన్ని త్రోసి పుచ్చడానికి ప్రయత్నిస్తాడు. లేదా ఒకవేళ అతడు సత్యము పైనే ఉన్నా, జగడంలో ఎంత విపరీత స్థాయికి వెళతాడూ అంటే సహనము, సభ్యతల హద్దు దాటి ప్రవర్తిస్తాడు, మూర్ఖత్వంతో వాదిస్తాడు.

Hadeeth benefits

  1. అన్యాయానికీ, దౌర్జన్యానికీ గురైన వాని తరఫున, అతని హక్కుల కొరకు వాదనకు దిగడం, న్యాయ స్థానములలో వాదించడం – నిందనీయ జగడము క్రిందకు రాదు.
  2. వైరము, విభేదాలు మరియు శత్రుత్వము – ఇవి నాలుక వలన కలిగే హాని, చెరుపులలో కొన్ని. ఇవి విశ్వాసుల మధ్య విభేదాలు, వైషమ్యాలు, సృష్టించి వారిని వేర్వేరు గ్రూపులుగా విడదీస్తాయి.
  3. సత్యము కొరకు వాదనకు దిగడం అభినందనీయమే, ఆ వాదన సభ్యత యొక్క హద్దులలో ఉండినట్లయితే. ఆ వాదన సత్యాన్ని త్రోసి పుచ్చడానికి, ఖండించడానికి, అసత్యాన్ని స్థాపింపజేయడానికి అయినట్లయితే లేదా సత్యాన్ని స్థాపించుటకు అవసరమైనది ఏదీ లేకుండా లేదా సరైన సాక్ష్యము లేకుండా వాదనకు దిగడం - ఇవి నిందనీయ వాదనల క్రిందకు వస్తాయి.