- ‘తాను నిజంగా అనుభూతి చెందని విషయాన్ని, అనుభూతి చెందినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించుటకు’ (అత్-తకల్లుఫ్ التَّكَلُّفِ) చెందిన విషయాలు ఏమిటంటే – ఎక్కువగా ప్రశ్నించడం, లేదా తనకు ఏమాత్రమూ ఙ్ఞానము లేని విషయములో ఎక్కువ కష్టపడుతున్నట్లు ప్రదర్శించడం, లేదా ఏదైనా విషయానికి సంబంధించి అల్లాహ్ అన్ని విధాలుగా సమృద్ధిగా సామర్థ్యము ప్రసాదించినప్పటికీ, అవసరం లేకపోయినా ఆ విషయమును ఆచరించుటలో ఎక్కువగా కష్టపడే కఠిన వైఖరిని అవలంబించుట.
- ఇందులో – ప్రతి ముస్లిం, తన మాటలలో గానీ, లేక ఆచరణలలో గానీ ఎదుటివారిని ఆకట్టుకోవడానికి ఎక్కువ కష్టపడుతున్నట్టు చూపించడం అనే అల్ప వైఖరి నుండి తనను తాను ఆపుకోవాలి, ప్రతి విషయములోనూ, ఉదా: తినుట, త్రాగుట, మాలాడుట మొదలైన ఇతర అన్ని విషయాలలోనూ, ఉదాత్తతను అలవాటు చేసుకోవాలి
- ఇస్లాం సౌలభ్యతను కలిగి యున్న ధర్మము (అంటే తనను అనుసరించుటలో సౌలభ్యమును కలిగి యున్న ధర్మము).