- ఆహారం భుజించునపుడు చివరన అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడుట అభిలషణీయం.
- ఈ హదీథు ఒక విధంగా అల్లాహ్ తన దాసులపై చూపిన అనుగ్రహం యొక్క ప్రకటన. వారి కొరకు ఆయన ఉపాధి మార్గాలను పొందుపరిచినాడు, వాటిని సులభతరం చేసినాడు; మరియు దానిని పాపాలకు ప్రాయశ్చిత్తంగా చేసినాడు.
- దాసుల వ్యవహారాలు అన్నీ సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ నుండే; వారి స్వంత శక్తి మరియు బలం కారణంగా అవి జరుగవు. అందుకనే దాసుడు వనరులు, ఉపకరణాలు మరియు మూలాధారాలపై పని చేయమని ఆఙ్ఞాపించబడినాడు (ఫలితం కేవలం అల్లాహ్ నుండి మాత్రమే).