- తినుట మరియు త్రాగుట ప్రారంభించడానికి ముందు అల్లాహ్ పేరును స్మరించుట ‘భోజన మర్యాదలలో’ ఒకటి.
- ప్రజలు తమ బాధ్యతలో, సంరక్షణలో ఉన్న పిల్లలకు వివిధ విషయాలకు సంబంధించి మర్యాదలను బోధించాలి.
- ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దయాపూరిత వ్యవహారం, పిల్లలకు (ఏదైనా విషయాన్ని) బోధించుటలో, వారికి క్రమశిక్షణ నేర్పించుటలో వారి ఓర్పు కనిపిస్తున్నాయి.
- భోజన మర్యాదలలో ఒకటి ఏమిటంటే మనిషి తనకు చేరువలో (తన ఎదురుగా) ఉన్నదానిలో నుండి తినుట – తన పళ్ళెంలో అనేక రకాల ఇతర భోజన పదార్థాలు ఉంటే తప్ప. అటువంటి సందర్భములో అతడు వాటినుండి తీసుకొన వచ్చును.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమకు బోధించిన దానికి, తమకు నేర్పిన క్రమశిక్షణకు సహబాలు కట్టుబడి ఉండేవారు. ఈ విషయాన్ని ఉమర్ బిన్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హు యొక్క - “అప్పటినుండి నేను అదే విధంగా తింటున్నాను” - అనే మాటల ద్వారా అర్థం అవుతున్నది.