- ఈ హదీసులో అల్లాహ్ యొక్క దాతృత్వపు ఘనత తెలియుచున్నది – జీవించుట కొరకు ఆయన ఉపాధి ప్రసాదిస్తున్నాడు. అందుకు కేవలం స్తుతులు, ప్రశంసలు, కృతజ్ఞతలతోనే సంతృప్తి చెందుతున్నాడు.
- అల్లాహ్ యొక్క సంతృప్తిని, సంతోషాన్ని పొందే సులభమైన మార్గము, తిన్న తరువాత, త్రాగిన తరువాత “అల్’హందులిల్లాహ్” అని ఆయనను స్తుతించడం.
- (అన్నం) తినుట మరియు (నీళ్ళు) త్రాగుటకు సంబంధించిన మర్యాదలు: తిన్న తరువాత, త్రాగిన తరువాత తప్పనిసరిగా “అల్’హందులిల్లాహ్” (సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి) అని అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడుట.