/ “(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్రజలకు శుభవార్తలు వినిపించండి, వారిని దూరం చేయకండి”...

“(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్రజలకు శుభవార్తలు వినిపించండి, వారిని దూరం చేయకండి”...

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్రజలకు శుభవార్తలు వినిపించండి, వారిని దూరం చేయకండి”.
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు – షరియత్ అనుమతించిన పరిధులకు అనుగుణంగా ధర్మానికి సంబంధించిన విషయాలైనా లేక ప్రాపంచిక జీవితానికి సంబంధించిన విషయాలైనా ఆచరించుటకు, అనుసరించుటకు సులభతరం చేయాలి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు సత్సందేశాలను, మంచి విషయాలను, శుభవార్తలను తెలియజేయాలని, వాటినుండి ప్రజలను దూరం చేయరాదని ఆదేశిస్తున్నారు.

Hadeeth benefits

  1. అల్లాహ్ ను ప్రేమించేలా మరియు మంచి పనులు చేసేలా ప్రజలను ప్రోత్సహించడం విశ్వాసి యొక్క విధి.
  2. ఒక దాయీ, ప్రజలకు ఇస్లాం సందేశాన్ని ప్రజలకు ఏవిధంగా చేరవేయాలి అనే విషయాన్ని వివేకవంతంగా అవగాహన చేసుకోవాలి.
  3. ప్రజలకు మంచి విషయాలు బోధించుట, అందులో వారికి శుభవార్తలు వినిపించుట వారిలో సంతోషాన్ని, ఆసక్తిని, కలుగజేస్తుంది. వారికి సమాశ్వాసాన్ని, భరోసాను, కలిగిస్తుంది.
  4. (విషయాలను సులభతరం చేయకుండా) ప్రయాస, ఇబ్బంది, కష్టము (కలిగేలా చేయడం) మొదలైనవి ప్రజలలో, ధర్మప్రచారకుడి మాటల పట్ల విముఖతను, సంశయవాదాన్ని కలుగజేస్తాయి.
  5. ఇందులో తన దాసుల పట్ల అల్లాహ్ కారుణ్యము యొక్క అపారమైన విస్తృతిని గురించి, మరియు వారికొరకు ఆయన సహనశీలత కలిగిన మరియు ఆచరించుటకు సులభతరమైన ఒక ధర్మాన్ని ప్రసాదించడం గురించి తెలుస్తున్నది.
  6. షరియత్ తీసుకు వచ్చిన ఆదేశం ఏమిటంటే – అది ప్రజలకు విషయాలను సులభతరం చేయడం.