- ఇందులో తుమ్ముటకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (ప్రవర్తనా విధానం), ఒక మార్గదర్శకముగా వివరించబడినది.
- తుమ్మునపుడు నోటికి అడ్డుగా ఏదైనా వస్త్రాన్ని, ఉదాహరణకు: చేతి రుమాలు, లేక అటువంటి ఏదైనా వస్త్రాన్ని పెట్టుకోవాలని సిఫారసు చేయబడుతున్నది – నోటి నుండి లేదా ముక్కు నుండి ఇతరులకు హాని, లేదా ఇబ్బంది కలిగించే ఏ పదార్థమూ బయటకు రాకుండా.
- తుమ్మినప్పుడు స్వరాన్ని తగ్గించుకోవడం తప్పనిసరి, మరియు ఇది మర్యాద యొక్క పరిపూర్ణత లోని మరియు నైతికత యొక్క గొప్పతనం లోని విషయము.