- ఇందులో విశ్వాసులైన తన దాసుల పట్ల అల్లాహ్ యొక్క కృప, ఆయన యొక్క కరుణ మరియు అనుగ్రహం తెలుస్తున్నాయి. ఇహలోక జీవితంలో దాసునిపై వచ్చిపడే కష్టాలు, తద్వారా (నరక శిక్షతో పోలిస్తే) అతనికి కలిగే అతి తక్కువ బాధ కారణంగా ఆయన అతని పాపాలను క్షమిస్తాడు.
- ఒక విశ్వాసి (ముస్లిం) ఈ ఇహలోక జీవితంలో అతనిపై ఏ కష్టం వచ్చిపడినా దాని ద్వారా అతడు అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని కోరుకోవాలి; అది చిన్నదైనా, లేక పెద్దదైనా అన్నింటిపై సహనం వహించాలి, తద్వారా అతడు (తీర్పు దినమున) తన స్థానములో వృద్ధినీ, మరియు తన పాపములకు పరిహారాన్నీ పొందుతాడు.