- ఒక ముస్లిం తన కొరకు దేనినైతే ఇష్ట పడతాడో, దానినే తన సహోదరుని కొరకు కూడా ఇష్టపడుట విధి (వాజిబ్). అలా చేయకపోతే అతని విశ్వాసం నిరాకరించబడడం అనేది ఆ విషయాన్ని వాజిబ్ చేస్తున్నది.
- ధర్మములో సహోదరత్వం (ఒక ముస్లిం మరొక ముస్లిమునకు ధార్మిక సహోదరుడు) అనేది, రక్తసంబంధ సహోదరత్వం కంటే కూడా పైస్థాయి కలిగి ఉన్నది. కనుక దాని హక్కు చెల్లించుట మరింతగా విధి (వాజిబ్) అవుతుంది.
- ఈ ప్రేమకు విరుద్ధమైన అన్ని మాటలు మరియు చర్యలను నిషేధించడం, వాటికి దూరంగా ఉండడం ముఖ్యం; అంటే ఉదాహరణకు: మోసం చేయడం, దూషించడం, అసూయ మరియు వ్యక్తిగతంగా ఒక ముస్లింనకు, అతని సంపదకు లేదా అతని గౌరవానికి వ్యతిరేకంగా దాడి చేయడం వంటివి, వీటికి దూరంగా ఉండాలి.
- తరుచూ “నా సోదరుని కొరకు” అనే లాంటి మాటలు ఉపయోగించడం, ఆ దిశలో ఆచరణను ప్రోత్సహిస్తుంది.
- అల్ కిర్మానీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఒక ముస్లిం తన కొరకు కీడును ఏ విధంగానైతే అసహ్యించుకుంటాడో, ఇష్టపడడో, అదే విధంగా తన సోదరుని కొరకు కూడా అయిష్ట పడుట విశ్వాసములోని భాగమే - అతడు దానిని వ్యక్తపరచకపోయినా సరే. ఎందుకంటే తన సోదరుని కొరకు ఒక విషయాన్ని ఇష్టపడుట అంటే, దానికి వ్యతిరేకమైన దానిని అసహ్యించుకొనుట కూడా కావాలి. కనుక ఆ అయిష్టమైన విషయాలను పూర్తిగా వదిలివేయుటతో అది సరిపోతుంది.