- విశ్వాసానికి సంబంధించి ప్రజలు విభిన్న స్థాయిలలో ఉంటారు.
- ఆచరణలలో అన్ని విధాలా శక్తిమంతంగా ఉండడం సిఫార్సు చేయబడుతున్నది; ఎందుకంటే తద్వారా బలహీనత కారణంగా సాధించలేని ప్రయోజనాలను కూడా సాధించడం సాధ్యమవుతుంది.
- మనిషి తనకు ప్రయోజనం కలిగించే వాటిని పట్టుకుని ఉండాలి; మరియు ప్రయోజనం కలిగించని విషయాలను విడిచి పెట్టాలి.
- విశ్వాసి తన అన్ని వ్యవహారలలో అల్లాహ్ యొక్క సహాయాన్ని కోరాలి, మరియు కేవలం తనపైనే తాను ఆధారపడి ఉండరాదు.
- ఈ హదీసు లో దైవిక శాసనం మరియు విధివ్రాతలను గురించి రుజువు (సాక్ష్యం) ఉంది. మరియు ఆశయసాధన కొరకు తగిన సాధనాలను వినియోగించడం మరియు విధానాలను అనుసరించడాన్ని విభేదించదు.
- పని జరగలేదనో, లేక అనుకున్న విధంగా జరగలేదనో, లేక కష్టం వచ్చి పడిందనో లేక నష్టం జరిగిందనో – కోపంతో అల్లాహ్ యొక్క ఆఙ్ఞను, విధివ్రాతను నిరసిస్తూ “ఒకవేళ ఇలా చేసి ఉంటే బాగుండేది” అనే మాటలు పలకడం నిషేధం.