- ఇందులో, పొరుగువాని హక్కులు ఎంత ఘనమైనవో, వాటి పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో తెలుస్తున్నది.
- పొరుగువానిని సంపదలో వారసునిగా చేసేటంత గట్టిగా అతని హక్కులను గురించి ప్రస్తావించడం అనేది, అతనితో గౌరవంగా ప్రవర్తించడం, అతనితో స్నేహంగా ప్రవర్తించడం, అతని పట్ల కరుణ కలిగి ఉండడం, అతడి నుండి కీడును, హానిని, చెడును దూరం చేయడం, అతడు జబ్బు పడితే వెళ్ళి అతడిని పరామర్శించడం, అతడి సంతోష సమయాలలో అతడికి శుభాకాంక్షలు చెప్పడం, అతడి కష్ట సమయాలలో అతడికి తోడ్పాటు నందజేయడం మొదలైన విషయాలు ఎంత ఆవశ్యకమైనవో తెలియజేస్తున్నది.
- పొరుగువాడు మన ఇంటికి ఎంత దగ్గరగా ఉంటే అతని హక్కులు అంత ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.
- సమాజానికి మేలు చేసే విషయాలలో, పొరుగువారి పట్ల దయాగుణం, కరుణ కలిగి ఉండడం, వారి నుండి చెడును, కీడును దూరం చేయడం మొదలైన విషయాలలో, షరియత్ యొక్క సంపూర్ణత కనిపిస్తున్నది.