“ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు కొనిపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నప...
అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు కొనిపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నపుడు (అతడు అల్-హందులిల్లాహ్ అని పలికినట్లయితే) అతడికి ‘యర్హకుముల్లాహ్’ అని సమాధానమిచ్చుట”.
ముత్తఫిఖ్ అలైహి
వివరణ
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిమునకు తన తోటి సోదర ముస్లింపై కొన్ని హక్కులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ హక్కులలో మొదటిది, మీపై శాంతి కురియాలని మీకు సలాముతో అభివాదం చేసిన వ్యక్తికి మీరు జవాబిచ్చుట.
రెండవ హక్కు: వ్యాధిగ్రస్తుడై ఉన్న ముస్లిం సోదరుని చూచేందుకు అతని వద్దకు వెళ్ళుట మరియు అతడిని పరామర్శించుట.
మూడవ హక్కు: ఎవరైనా ముస్లిం సోదరుడు చనిపోతే, అతడి జనాజాను (శవయాత్ర)ను అతని ఇంటి నుండి, జనాజా నమాజు కొరకు మస్జిదు వరకు, నమాజు తరువాత అతడిని ఖననం చేయుట కొరకు స్మశానము వరకు అనుసరించుట.
నాలుగవ హక్కు: ఎవరైనా విందు భోజనానికి ఆహ్వానిస్తే - ఉదాహరణకు, వలిమా విందు లేదా అటువంటి ఇతర విందులు – ఆ ఆహ్వానాన్ని స్వీకరించుట.
ఐదవ హక్కు: తుమ్మిన వ్యక్తికి జవాబిచ్చుట; ఒకవేళ తుమ్మిన వ్యక్తి (అల్ హందులిల్లాహ్ అని) అల్లాహ్ కు స్తోత్రములు పలికినట్లయితే, అతడికి “అల్లాహ్ నిన్ను కరుణించుగాక” (యర్హముకల్లాహ్) అని జవాబు ఇవ్వాలి, అపుడు తుమ్మిన వ్యక్తి “అల్లాహ్ మీకు మార్గదర్శకత్వం చేయుగాక మరియు మీ వ్యవహారములను చక్కదిద్దుగాక” (యహ్’దీకుముల్లాహు, వ యుస్లిహు బాలకుం) అని పలకాలి.
Hadeeth benefits
ముస్లిముల మధ్య హక్కులను స్థిరపరచడం మరియు వారి మధ్య సహోదరత్వాన్ని, ప్రేమను పటిష్ఠ పరచడం వంటి విషయాలలో ఇస్లాం యొక్క ఔన్నత్యం ప్రస్ఫుటమవుతున్నది.
Share
Use the QR code to easily share the message of Islam with others