- ఈ హదీథులో – ఇస్లామీయ షరియహ్’లో ధార్మిక ఆచణల పట్ల సౌలభ్యము మరియు సహనము తెలుస్తున్నాయి. ఆచరణలలో ‘అతి’కి వెళ్ళిపోయి ధర్మాన్ని కఠినతరం చేసుకోవడానికీ మరియు ఆచరణలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడానికీ – ఈ రెండు మితిమీరే స్థితుల మధ్య (మితిమీరిన ఆచరణ మరియు మితిమీరిన నిర్లక్ష్యం మధ్య) షరియత్ యొక్క నియంత్రణ కనిపిస్తున్నది.
- ధర్మానికి సంబంధించిన ఏ ఆదేశాన్నైనా దాసుడు తన శక్తి సామర్ధ్యాల మేరకు ఎంతగా వీలైతే అంత ఉత్తమంగా నెరవేర్చడానికి కృషి చేయాలి - ఆచరించుటలో తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడం లేదా ఆచరణలో మరీ ఉదాసీన, తేలిక, నిర్లక్ష్యత కూడిన వైఖరిని అవలంబించడం కాకుండా.
- దాసుడు ఆరాధన కార్యకలాపాల సమయాలను ఎన్నుకోవాలి; మరియు ఈ మూడు సమయాలు; ప్రత్యేకించి ఆరాధన కొరకు; శరీరం అత్యంత చురుకుగా ఉండే సమయాలు.
- ఇబ్న్ హజర్ అల్-అస్కలానీ ఇలా అన్నారు: ఈ హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రయాణికుడిని అతని గమ్యస్థానం వైపునకు మార్గదర్శకం చేస్తూ ప్రసంగించినట్లుగా ఉంది; మరియు ఈ మూడు సమయాలు ఒక ప్రయాణీకునికి ఉత్తమ సమయాలు, కనుక ప్రవక్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడి కార్యకలాపాల సమయాలను గురించి అతనికి హెచ్చరించారు. ఎందుకంటే అతడు రాత్రనక పగలనక ప్రయాణం చేస్తే అతడు అశక్తుడు అయిపోతాడు మరియు తన గమ్యస్థానం నుండి వేరైపోతాడు. అలాకాక అతను ఈ చురుకైన సమయాల్లో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, అతను ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించగలడు.
- ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథులో షరియత్ పరంగా లభించే సౌలభ్యాన్ని వినియోగించుకోవాలనే సూచన ఉన్నది. ఎందుకంటే సౌలభ్యానికి బదులుగా కాఠిన్యాన్ని ఎన్నుకోవడం – అది తీవ్రవాదం అవుతుంది; ఉదాహరణకు: పరిశుభ్రత కొరకు అంటే ఉదూ, గుసుల్ కొరకు నీటిని వినియోగించలేని స్థితిలో ఉన్న వ్యక్తి తయమ్మం ను ఆచరించకుండా, దానిని వదిలి నీటినే ఉపయోగించినట్లైతే – అది అతనికి హాని కలగడానికి దారి తీస్తుంది.
- ఇబ్నుల్ మునీర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథులో ప్రవక్తత్వపు నిదర్శనాలలో నుండి ఒక నిదర్శనం ఉన్నది. ఎందుకంటే, ధర్మములో ఆచరణలలో తీవ్రస్థాయికి పోయి మార్గభ్రష్ఠులైన ‘అతి’ వాదులను (తీవ్రవాదులను) మేము చూసినాము మరియు మాకు ముందు గడిచిన ప్రజలు కూడా చూసినారు. దీని అర్థము ‘ఇబాదత్’ లో (ఆరాధనలో) అత్యంత పరిపూర్ణతను కోరుకోవడాన్ని నిరోధించడం కాదు, ఎందుకంటే ఇబాదత్’లో పరిపూర్ణత సాధించుట ప్రశంసించదగిన విషయాలలో ఒకటి. అసలు ఉద్దేశ్యము విసుగును కలిగించే విపరీత తత్వాన్నినివారించడం; మరియు ఉత్తమమైన దానిని వదలివేయటానికి దారితీసే స్వచ్ఛంద ప్రార్థనలో అతిశయోక్తిని నివారించండం. ఉదాహరణకు: ఫర్జ్ నమాజును దాని నిర్ధారిత సమయానికి ఆవల ఆచరించడం; ఎలాగంటే ఒకవ్యక్తి రాత్రంతా నఫీల్ నమాజులు ఆచరించుటలో గడిపి ఫజ్ర్ నమాజు యొక్క జమాఅత్ జరుగుతున్న సమయాన నిద్రపోతూ ఉండడం, లేక సూర్యోదయం అయిపోయేంత వరకు నిద్రపోతూ ఉండడం.