- భౌతికంగా లేదా నైతికంగా ఇతరులకు హాని కలిగించకుండా ఉండటం ద్వారా మాత్రమే ఇస్లాం యొక్క పరిపూర్ణత సాధించబడుతుంది.
- ఈ హదీసులో నాలుక మరియు చేయి ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి - వాటి వల్ల జరిగే అనేక తప్పులు మరియు హాని కారణంగా. చాలా చెడులు వాటి నుంచే వస్తాయి.
- ఇందులో చెడును వదలివేయాలనే, మరియు అల్లాహ్ ఆదేశాలను శిరసావహించాలనే హితబోధ ఉన్నది.
- అల్లాహ్ యొక్క హక్కులను మరియు తోటి ముస్లిముల యొక్క హక్కులను ఎవరైతే నెరవేరుస్తారో వారే ఉత్తములైన ముస్లిములు.
- ‘దాడి చేయుట’ అనేది మాటల ద్వారా లేక చేతల ద్వారా – ఏదైనా కావచ్చు.
- ‘హిజ్రత్’ (వలస పోవుట) అంటే అల్లాహ్ నిషేధించిన వాటి నుండి సంపూర్ణంగా వలస పోవుట, అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిషేధించిన దానిని విడిచిపెట్టడమే పరిపూర్ణ వలస.