- ఇందులో (ప్రతి ఒక్కరూ ఐదు నమాజులను) మస్జిదులో జామఅత్’తో ఆచరించుట యొక్క ప్రాముఖ్యత, మరియు దానిని పరిరక్షించవలసిన ఆవశ్యకతను చూడవచ్చు.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయాన్ని బోధించే విధానంలో ఒక మంచి విధానాన్ని ప్రదర్శించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఆ విషయానికి సంబంధించిన గొప్ప బహుమతితో ప్రారంభించి, ప్రశ్నల రూపంలో వారిలో మరింత ఉత్సుకత నింపేవారు. తరువాత ఆ విషయాన్ని వెల్లడించారు. విషయాన్ని బోధించే విధానాలలో ఇది ఒకటి.
- ప్రశ్న మరియు సమాధానాలతో సమస్యను ముందుంచడం వల్ల కలిగే ప్రయోజనం: సందిగ్ధత మరియు స్పష్టీకరణ కారణంగా ఆ ప్రసంగం ఆత్మను తాకుతుంది.
- ఇమామ్ ఆన్’నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ఇది “అర్’రిబాత్’, అంటే: అది మనం కావాలని కోరుకునే బంధం. ‘రిబాత్’ అనే పదం యొక్క మూలార్థము ‘దేనినైనా బంధించి ఉంచడం, దానిని పరిమితం చేయడం’; అంటే దాసుడు తనను తాను (తన ప్రభువు యొక్క) విధేయతకు బంధించుకుని ఉండడం. ధర్మపండితులు ఇంకా ఇలా అన్నారు: అది ఉత్తమమైన బంధం; ధర్మ పండితులు ఇంకా ఇలా అన్నారు: ‘జిహాద్’ అంటే తన ఆత్మతో తాను స్వీయజిహాద్ (స్వీయపోరాటం) చేయడం. మరియు అది (ప్రతి ఒక్కరికీ) అందుబాటులో ఉన్న బంధం, మరియు (ప్రతి ఒక్కరికీ) సాధ్యమయ్యే బంధం, అది సాధ్యమే. అంటే: ఇది (అర్’రిబాత్) అటువంటి బంధాలలో ఒకటి.
- ఈ హదీసులో “రిబాత్” అనే పదం చాలా సార్లు పునరావృతం అయ్యింది. అది (ال) అనే డెఫినైట్ ఆర్టికిల్ (నిర్దిష్టోపపదం) తో ప్రస్తావించబడినది. ఇది ఈ ఆచరణ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలియజేస్తుంది.