- ఈ హదీసు ద్వారా మనం నిద్రకు ఉపక్రమించడానికి ముందు, రెండు అర చేతులపై ఊది, సూరా అల్ ఇఖ్లాస్ (ఖుల్ హువల్లాహు అహద్), మరియు ‘ముఅవ్విదతైన్’ లను (సూరా ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్ మరియు సూరా ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్) పఠించి, ఆ అరచేతులతో శరీరం పై అందినంత మేర తుడుచుకోవడం అభిలషణీయం అని తెలుస్తున్నది.