- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని అనుసరిస్తూ ఈ ధ్యానాన్ని (దిక్ర్ లను) ఉదయం మరియు సాయంత్రం పలుకుతూ ఉండడం ‘ముస్తహబ్’ (నొక్కి వక్కాణించబడిన ఆచరణ)
- దాసునికి అతని అన్ని పరిస్థితులు మరియు సమయాలలో తన ప్రభువు అవసరం ఉంటుంది.
- అల్లాహ్ యొక్క స్మరణలను స్మరించుకునే ఉత్తమ సమయం దినారంభములో, అంటే ఉషోదయం (ఫజ్ర్) సమయం నుండి మొదలుకుని సూర్యుడు ఉదయించడానికి మధ్యన; మరియు అస్ర్ తరువాత నుండి మొదలుకుని సూర్యుడు అస్తమించడానికి ముందు వరకు. ఒకవేళ ఎవరైనా ఆ తరువాత ఈ స్మరణలను పలికినట్లయితే? అంటే ఒకవేళ ఎవరైనా ఉదయం సూర్యుడు ఉదయించిన తరువాత పలికినట్లయితే – అది అతనికి సరిపోతుంది; అలాగే ఎవరైనా జుహ్ర్ తరువాత పలికినట్లయితే – అది అతనికి సరిపోతుంది; ఒకవేళ ఎవరైనా మగ్రిబ్ తరువాత పలికినట్లయితే – అది అతనికి సరిపోతుంది. ఎందుకంటే అవి స్మరణలను పలికే సమయాలే.
- ఉదయం పూట "వ ఇలైకన్నుషూర్ - మరియు మా పునరుత్థానం కూడా నీ వైపునకే" అని పలుకుటలో ఔచిత్యమేమిటంటే, ప్రజలు చనిపోయిన తరువాత, వారికి పునరుజ్జీవనం కలిగించే ‘మహా పునరుథ్థాన దినమును’ అది వారికి గుర్తు చేస్తుంది. అది వారి నూతన పునరుజ్జీవనం, ‘అర్వాహ్’ లోనికి ఆత్మలు తిరిగి వచ్చే కొత్త రోజు అది, అందులో ప్రజలు నలువైపులా విస్తరిస్తారు, అల్లాహ్ సృష్టించిన ఆ దినము, ఆదము సంతతిపై ఒక సాక్ష్యము లాగా కొత్తగా ఊపిరి పోసుకుంటుంది. దాని కాలముల యొక్క నిక్షేపస్థానములు మన ఆచరణల భాండాగారాలు.
- సాయంకాలము “వ ఇలైకల్ మసీర్” అని స్మరణ చేయుటలో ఔచిత్యము ఏమిటంటే – తమ తమ జీవిక, బతుకు తెరువు కొరకు ఉదయం నలువైపులకు వెళ్ళిపోయి, అలసి సొలసి తమ తమ పనుల నుండి ఇళ్లకు తిరిగి వచ్చి, సేదదీరి విశ్రమిస్తారు. ఇది వారికి సర్వోన్నతుడు, పరమ పవిత్రుడు అయిన అల్లాహ్ వైపునకే తాము తిరిగి వెళ్ళవలసి ఉన్నదనే విషయాన్ని, తమ నిజ గమ్యస్థానము, చిట్టచివరి మజిలీ అదే అనే విషయాన్ని వారికి గుర్తుచేస్తుంది.