- “సూరహ్ అల్ ఇఖ్లాస్ (ఖుల్ హువాల్లాహు అహద్), మరియు ముఅవ్విజతైన్’ (సూరహ్ అల్ ఫలఖ్ - “ఖుల్ అఊజు బిరబ్బీల్ ఫలఖ్”, మరియు సూరహ్ అన్నాస్ “ఖుల్ అఊజు బిరబ్బీన్నాస్”) వీటిని సాయంత్రపు సమయాన, మరియు ఉదయం మూడు సార్లు పఠించుట అభిలషణీయం; అది అన్ని రకాల చెడు మరియు కీడు, హాని నుండి రక్షణ అవుతుంది.
- ఈ హదీసులో సూరహ్ అల్ ఇఖ్లాస్, మరియు ముఅవ్విజతైన్’లను పఠించుట యొక్క ఘనత తెలుస్తున్నది.