- సజ్దహ్’లో ఈ దుఆలను చేయుట అభిలషణీయము.
- మీరక్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఇమాం నసయీ తన సునన్ అన్’నసాయీలో నమోదు చేసిన ఇదే హదీథులో ఉల్లేఖకుడు ఇలా అన్నారు: “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించి, నిద్రకు ఉపక్రమించే ముందు ఈ దుఆ పఠించేవారు.”
- అల్లాహ్’ను వేడుకొనునపుడు, ఆయనకు మొరపెట్టుకొనునపుడు, ఖుర్’ఆన్ మరియు సున్నతులలో ధృవీకరించబడిన ఆయన ఉత్తమమైన నామములతో ఆయనను స్తుతిస్తూ, ఆయన ఘనతను కొనియాడుతూ వేడుకొనుట అభిలషణీయము.
- రుకూ మరియు సజ్దహ్’లలో సృష్టికర్తను కీర్తించుట, ఆయన ఘనతను కొనియాడుట కూడా ఇందులో ఉన్నది.
- సర్వోన్నతుడైన అల్లాహ్’ను నేరుగా వేడుకొట, ఉదాహరణకు ‘ఓ అల్లాహ్! నా ఈ కష్టాన్ని తొలగించు’ అని వేడుకొనుటకు – ఏ విధంగా అనుమతి ఉన్నదో, అదే విధంగా అల్లాహ్ యొక్క గుణలక్షణాల ద్వారా కూడా ఆయనను వేడుకొనవచ్చును.
- అల్-ఖత్తాబీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “తరచి చూస్తే ఈ దుఆలో సూక్ష్మమైన, నిగూఢమైన అర్థం మనకు కనిపిస్తుంది, అదేమిటంటే: ‘ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క అనుగ్రహం, దయ, కృప ద్వారా ఆయన ఆగ్రహం నుండి రక్షణ కోరినారు; ఆయన క్షమాగుణం, క్షమాభిక్ష ద్వారా ఆయన శిక్ష నుండి రక్షణ కోరినారు; గమనించండి, “ఆగ్రహం మరియు అనుగ్రహం” ఇవి రెండూ ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనవి; అలాగే “శిక్ష మరియు క్షమాభిక్ష” ఇవి రెండూ ఒకదానికొకటి వ్యతిరేకమైనవి; ఎవరికి వ్యతిరేకంగానైతే ఏమీ లేదో, ఆయనను ప్రస్తావించినపుడు, అంటే అల్లాహ్’ను ప్రస్తావించినపుడు, ఆయన నుండి ఆయన రక్షణనే కోరుకున్నారు. దీని అర్థము: అల్లాహ్ యొక్క ఆరాధనలను నెరవేర్చడంలో, ఆయనను స్తుతించుటలో జరిగే వైఫల్యాల నుండి ఆయన రక్షణ కోరడం. ఈ వైఫల్యాల నుండి ఆయన వద్ద తప్ప మరింకెవరి వద్ద రక్షణ కోరగలం. దుఆలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్యము: “లా ఉహ్’సీ థనాఅన్ అలైక - నేను నీ ప్రశంసలను లెక్కించలేను” – అంటే, “అన్ని రకాల ప్రశంసలూ నీ కొరకే, నీ ప్రశంసలు లెక్కలేనన్ని, నేను నీ ప్రశంసలను లెక్కించలేను, ఆ సమర్థత లేని వాడను, నేను ఎంత ప్రయత్నించినా నీ ప్రశంసలను, నీ ఘనతను, నీ కృపను, దయాదాక్షిణ్యాలను, నీ అనుగ్రహాన్ని లెక్కించలేను, సాధించలేను.”