- అల్లాహ్ ఆదేశముతో అకస్మాత్తుగా వచ్చి పడే ఏదైనా కీడు, ఆపద లేక హాని మొదలైన వాటి నుండి రక్షించబడుటకు గాను, ఈ జిక్ర్’ను (స్మరణను) ఉదయమూ, సాయంత్రమూ చేయుట మంచిది.
- ఈ హదీథు ద్వారా, అల్లాహ్ యందు మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటల యందు, పూర్వకాలపు సలఫ్’ సాలిహీనుల దృఢమైన మరియు అచంచలమైన విశ్వాసాన్ని మనం చూడవచ్చు.
- ఉదయం మరియు సాయంత్రం దిక్ర్ చేయాలని సూచించడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి, ఒక ముస్లిం అజాగ్రత్త వహించ కుండా నిరోధించడం మరియు అతను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క దాసుడు అనే వాస్తవాన్ని నిరంతరం గుర్తుచేసుకోవడంలో అతనికి సహాయం చేయడం.
- దిక్ర్ యొక్క ప్రభావం మరియు దిక్ర్ యొక్క నెరవేర్పు - అల్లాహ్ ను స్మరించుకునే వ్యక్తి యొక్క విశ్వాస స్థాయి, అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల, వారి ఆదేశాల పట్ల అతని విధేయత, అతని చిత్తశుద్ధి మరియు ధృవీకరణతో పాటు దిక్ర్ చేయునపుడు అతని హృదయం దానిపై లగ్నమై ఉండుటపై ఆధారపడి ఉంటుంది.