- ఙ్ఞానము మరియు ఆచరణ – ఈ రెంటి కలయిక అనేది అల్లాహ్ ఆగ్రహానికి గ్రియైన వారి మార్గమునుండి, మరియు మార్గభ్రష్ఠులైన వారి మార్గము నుండి ముక్తిని పొందే సాధనము.
- ఇందులో యూదులు మరియు క్రైస్తవుల మార్గమును గురించిన హెచ్చరిక, మరియు ఋజుమార్గానికే, అంటే ఇస్లాం ధర్మానికే విధిగా కట్టుబడి ఉండడం తప్పనిసరి అనే హితబోధ ఉన్నది.
- నిజానికి యూదులు మరియు క్రైస్తవులు ఇద్దరూ మార్గభ్రష్ఠులే, అల్లాహ్ ఆగ్రహానికి పాత్రులే; అయితే ఈ హదీథులో ప్రత్యేకించి యూదులు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి, మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠత్వానికి గురైనట్టు వర్ణించబడినారు.