- చెడును చూసిన వెంటనే దానికి ఖండించాలి, నిరాకరించాలి, అలా చేయడంలో అలసత్వం వహించరాదు; లేకపోయినట్లయితే అది గొప్ప నష్టాన్ని కలుగజేయగలదు.
- పునరుత్థాన దినాన, చేసిన పాప కార్యము యొక్క తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది.
- జీవరాసుల చిత్రాలను చిత్రించడం “కబాయిర్”లలో (పెద్ద పాపములలో) ఒకటి.
- బొమ్మలు, చిత్రాలు, విగ్రహాలు తయారు చేయడాన్ని నిషేధించడం వెనుక ఉన్న ఒక హేతుబద్ధత ఏమిటంటే, అల్లాహ్ యొక్క సృష్టిని అనుకరించడం, వాటిని తయారుచేసే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసినా, చేయకపోయినా.
- వస్తువులలో షరియత్ నిషేధించిన వాటి ఉనికి ఏమైనా ఉన్నట్లయితే, వాటిని తొలగించిన తరువాత ఆ వస్తువులను ఉపయోగం లోనికి తీసుకుని రావచ్చును. ఆ విధంగా ఆ వస్తువులపై చేసిన ఖర్చును, తద్వారా సంపదను రక్షించడం పట్ల షరియత్ శ్రద్ధ వహిస్తుంది.
- ఏ రూపంలోనైనా జీవుల చిత్రాలను తయారు చేయడం నిషేధించబడింది; ఆ చిత్రాలు వాటిని లేక వారిని విమర్శించడానికి, అగౌరవ పరచడానికి రూపొందించినవి అయినా సరే.